క్రేజీ కాంబినేష‌న్ రిపీట్.. సీనియ‌ర్ హీరోయిన్‌తో మెగాస్టార్ - MicTv.in - Telugu News
mictv telugu

క్రేజీ కాంబినేష‌న్ రిపీట్.. సీనియ‌ర్ హీరోయిన్‌తో మెగాస్టార్

May 2, 2022

సీనియ‌ర్ హీరోయిన్ ఆర్. రాధిక శ‌ర‌త్ కుమార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇటీవలే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ఈ టాలెంటెడ్ హీరోయిన్. 80,90 దశకాల్లో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాధిక‌.. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సూప‌ర్ హిట్ మూవీస్ చేశారు. వీరిద్దిరిది వెండితెరపై తిరుగులేని కాంబినేషన్. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత వారిద్ద‌రు క‌ల‌సి ఓ ప్రాజెక్ట్ కోసం ప‌నిచేయ‌నున్నారు. చిరంజీవి హీరోగా తాను ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు రాధిక ట్విటర్లో తెలిపారు. ‘కింగ్ ఆఫ్ మాస్ తో బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నాం’ అని తెలిపారు.

 

‘మా (రాడాన్ )బ్యానర్‌లో ప్రాజెక్టు చేయ‌డానికి ఒప్పుకున్నందుకు చిరంజీవికి ధ‌న్యవాదాలు..కింగ్ ఆఫ్ మాస్‌తో బ్లాక్ బాస్ట‌ర్ ప్రాజెక్టు చేసేందుకు చాలా ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్నాన‌ని’ రాధిక ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు.. నటీనటులు అనే వివరాలు ఏవీ ఇంకా తెలియలేదు. వీలైనంత త్వరలో తెలిసే అవకాశం కనిపిస్తోంది. రాధిక భర్త శరత్ కుమార్ కూడా సీనియర్ నటుడు. శరత్ కుమార్ చిరంజీవితో కలిసి గ్యాంగ్ లీడర్, స్టువర్టుపురం చిత్రాల్లో నటించారు. అలా చిరంజీవి శరత్ కుమార్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.
ఆచార్య రిజల్ట్ తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు ఈ న్యూస్ కొంత జోష్ నింపుతుందనడంలో సందేహం లేదు.