రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు: ఎక్సైజ్‌ శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు: ఎక్సైజ్‌ శాఖ

April 7, 2022

fbdfgb

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌లో గత శనివారం రాత్రి బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో భాగంగా పబ్‌లో డ్రగ్స్‌ వాడుతున్నట్లు బయటపడటంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని, దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వం పబ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పబ్‌, లిక్కర్‌ లైసెన్సులను రద్దు చేసింది. 24 గంటలపాటు మద్యం సప్లైకి రాడిసన్‌ హోటల్‌ అనుమతి తీసుకున్నది. జనవరి 21న మద్యం సప్లైకి రాడిసన్‌ హోటల్‌ అనుమతి పొందింది. రూ.56 లక్షలు బార్‌ టాక్స్‌ చెల్లించి అనుమతిని తీసుకున్నారు. 2బి బార్‌ అండ్ రెస్టారెంట్‌ పేరుతో అనుమతులు పొందారు. అయితే, పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం బయటపడటంతో ఎక్సైజ్‌ శాఖ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరోపక్క ఈ కేసు విషయంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల పిల్లలు, రాజకీయ నాయకుల బంధువులు ఉండడంతో సంచలనంగా మారింది. ఈ వ్యవహరాన్ని సవాల్ చేస్తూ, పీసీసీ రేవంత్ రెడ్డి తమ బంధువుల పిల్లల బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి మేం సిద్దం.. కేసీఆర్ కొడుకు కేటీఆర్ సిద్దమా అని అడిగారు. మరికొంతమంది పబ్‌కు వెళ్లిన మాట నిజమే కాని, మేం అక్కడి ఏం చేయలేదు. మాకేమి తెలీదు అంటూ దయచేసి మమ్మల్ని వదిలేయండి అని సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకున్నారు.