కామన్వెల్త్‌లో తెలుగు కుర్రాడికి గోల్డ్ మెడల్ - MicTv.in - Telugu News
mictv telugu

కామన్వెల్త్‌లో తెలుగు కుర్రాడికి గోల్డ్ మెడల్

April 7, 2018

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ స్వర్ణ పతాలను కొల్లగొడుతోంది. పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 85 కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన తెలుగు కుర్రాడు రాగాల వెంకట్‌ రాహుల్‌ గోల్డ్ మెడల్ సాధించాడు. స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్కుల్లో భాగంగా మొత్తం 338 కేజీలను అలవోకగా ఎత్తేశాడు. ​​దీంతో ఈ క్రీడల్లో భారత్‌ స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు బంగారాలు వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే వచ్చాయి. ఈ టోర్నీలో భారత్‌కు వచ్చిన ఆరు పతకాలు కూడా వెయిలిఫ్టింగ్‌లోనే దక్కాయి.తొలిరోజు మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను, రెండో రోజు 48 కేజీల విభాగంలో సంజితా చాను, ఈ రోజు 77 కేజీల విభాగం పోటీల్లో సతీశ్‌ కుమార్‌ శివలింగం, పాటు వెంకట్‌ రాహుల్‌లు పసిడి పతకాలు సాధించారు. తొలిరోజు పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో గురురాజా వెండిని కొట్టేయగా, నిన్న 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్‌ లాథర్‌ కాంస్యాన్ని సాధించాడు. శివలింగానికి తమిళనాడు ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది.