ర్యాగింగ్ పేరిట అమ్మాయికి వేధింపులు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ర్యాగింగ్ పేరిట అమ్మాయికి వేధింపులు.. వీడియో వైరల్

November 18, 2022

ఒడిశాలోని బరంపురంలో దారుణం చోటుచేసుకుంది. బినాయక్‌ ఆచార్య ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలకు పాల్పడ్డారు సీనియర్ విద్యార్థులు. ర్యాగింగ్ పేరుతో అమ్మాయిలను వేధించారు. వారికి ముద్దులు పెట్టి రాక్షసానందం పొందారు. ఆ దృశ్యాలను వీడియోలు తీసి పైశాచికత్వం ప్రదర్శించారు.

అదే కాలేజీలో చదువుతున్న అమ్మాయిని.. ఐదుగురు అబ్బాయిలు దారుణంగా ర్యాగింగ్ చేశారు. ఓ విద్యార్థి బలవంతంగా ఆమెకు ముద్దు పెట్టాడు. ఆ ఆమ్మాయి వద్దని వారించినా భయపెట్టి బలవంతం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేసి వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 12 మంది విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. వారికి టీసీలు ఇచ్చి కాలేజీ నుంచి బహిష్కరించారు.