Ragging incident in ibs
mictv telugu

హైదరాబాద్‌లో ర్యాగింగ్..కేటీఆర్‌కు ట్వీట్

November 12, 2022

హైదరాబాద్‌లో మరోసారి ర్యాగింగ్ కల్చర్ కలకలం రేపింది. కొన్ని సంవత్సరాలుగా తగ్గిన ర్యాగింగ్ భూతం తాజాగా పురివిప్పడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని IBS కాలేజీలో సీనియర్ విద్యార్థులు రెచ్చిపోయారు. ర్యాగింగ్ పేరుతో ఓ జూనియర్ విద్యార్థిని రూంలో బంధించి దాడి చేశారు. జూనియర్‌పై కర్కశకంగా ప్రవర్తించి..పిడిగుద్దులు గుద్దుతూ హింసించారు. ముఖం మీద పౌడర్ చల్లి తీవ్రంగా కొట్టారు. దాడి చేసిన విద్యార్ధులపై మరో వర్గం దాడి చేసింది. ఈ ర్యాగింగ్ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో.. ఇరు వర్గాలను మందలించి పంపించినట్టు తెలుస్తోంది. అయితే ర్యాగింగ్ ఘటనపై మంత్రి కేటీఆర్‌కు బాధిత విద్యార్థి ట్వీట్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం మరికొంతమంది చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం ఏడాది పాటు సస్పెండ్ చేసింది.

IBS కాలేజీ విద్యార్ధులమధ్య.. దొంతనపల్లి గ్రామ శివారులో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీలో ర్యాగింగ్ కూడా ఎప్పటినుంచో జరుగుతున్నట్టు సమాచారం.