అందమైన అభ్యర్థి ప్రచారానికి వెళ్తే.. పరిస్థితి ఇదీ..  - MicTv.in - Telugu News
mictv telugu

అందమైన అభ్యర్థి ప్రచారానికి వెళ్తే.. పరిస్థితి ఇదీ.. 

February 5, 2020

hnfnhg

ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్ల నుంచి నియోజగవర్గ సమస్యల గురించి వినతులు వస్తుంటాయి. కానీ, ఆమ్‌ ఆద్మీకి చెందిన రాజేంద్ర నగర్ అభ్యర్థి రాఘవ్ చద్దాకు మాత్రం పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. ఆయన ప్రచారంలో పాల్గొన్న సమయంలో..’మీరు చాలా బాగున్నారు.. మమ్మల్ని పెళ్లాడతారా? పెళ్లి చేసుకోండి’ అంటూ ఆ ప్రాంతంలోని యువతులు క్యూ కట్టేస్తున్నారు. దాదాపు ఓ డజను ప్రతిపాదనలకు పైగానే ఆయనకు వచ్చినట్లు సమాచారం. 

ప్రచారంలో భాగంగా ఆయన కొన్ని రోజుల క్రితం ఓ పాఠశాలకు వెళ్లిన సందర్భంలో అక్కడి టీచర్…’నాకంటూ ఓ కూతురుంటే మీకే ఇచ్చేవాళ్లం’ అని అన్నారని సమాచారం. అంతేకాకుండా మూడు రోజుల క్రితం…’మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.’ అని ఓ మహిళ ట్విట్టర్ వేదికగా రాఘవ్‌ను కోరింది. దీనికి స్పందించిన రాఘవ్…ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, పెళ్లికి ఇది సమయం కాదని రిప్లయ్ ఇచ్చారు. మరో మహిళ ఓ అడుగు ముందుకేసి…దేశంలోనే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అంటూ ట్వీట్ చేసింది. సీఏగా కెరీర్ ప్రారంభించిన రాఘవ్… తరువాత రాజకీయాలోకి ప్రవేశించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.