అన్నీ కోల్పోయిన అవ్వకు కొత్త ఇళ్లు.. రియల్ హీరో లారెన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

అన్నీ కోల్పోయిన అవ్వకు కొత్త ఇళ్లు.. రియల్ హీరో లారెన్స్

May 19, 2019

Raghava Lawrence builds house for Gaja cyclone victim Photos of house warming ceremony.

భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన ఓ అవ్వకు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ అండగా నిలిచారు. గతేడాది గజ తుఫాన్ కారణంగా ఓ వృద్ధురాలి ఇళ్లు ధ్వంసమైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ అవ్వను చూసిన లారెన్స్ గుండె తరుక్కుపోయింది. అంతే ఆమె కోసం కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చాడు.

రాఘవ లారెన్స్ అవ్వకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రూ.10లక్షలు ఖర్చు చేశాడు. అంతేకాదు అవ్వతో కలిసి ఆ ఇంట్లో గృహప్రవేశ పూజలు నిర్వహించాడు. అందుకు సంబంధించిన ఫొటోలో ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్లు.. ‘రాఘవ లారెన్స్ నువ్వు నిజంగా రియల్ హీరోవి.. నీకు హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

లారెన్స్ ఇటీవల గణేశన్ అనే కారు డ్రైవర్ కు కూడా సొంత ఇంటిని నిర్మించి ఇచ్చాడు. అంతేకాదు గతంలో అనేక మంది చిన్నారులు, వికలాంగులకు ఆర్థికంగా లారెన్స్ సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.