కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామారాజు లేఖ రాశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భారీ భద్రత కల్పించాలని తన లేఖలో కోరారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని, అతని కాన్వాయ్ ని గుర్తుతెలియని వ్యకులు ఫాలో అవుతున్నట్లు లేఖలో రఘురామరాజు పేర్కొన్నారు. ఈ ఘటనలను పరిగణనలోకి తీసుకుని ముప్పు నుంచి పవన్‌కు రక్షణ కల్పించేలా తగినంత భద్రతను కల్పించాలని ఆయన అమిత్ షాను కోరారు.
మూడు రోజుల కిందట పవన్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నించిన పవన్ బౌన్స్ ర్లతో వాగ్వాదానికి దిగారు. దీనిపై ఏపీలో తీవ్ర దుమారం రేగింది. పవన్ హత్యకు కుట్రలు జరుగుతున్నాయని..అందుకు రూ.250 కోట్లు సుపారీ ఇచ్చారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.చంద్రబాబుపై సైతం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే వైసీసీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఇక పవన్ కల్యాణ్ ఇంటివద్ద న్యూసెన్స్ చేసి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. పవన్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని..వారు తాగిన మైకంలో గొడవ చేసారని హైదరాబాద్ పోలీసులు తేల్చారు.