ఆందోళనకు దిగిన రఘునందన్ రావు.. విరుదొడ్డిలో ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

ఆందోళనకు దిగిన రఘునందన్ రావు.. విరుదొడ్డిలో ఉద్రిక్తత

March 31, 2022

bfbb

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు హైదరాబాద్‌లోని మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో గురువారం ఆందోళనకు దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకు రక్షణ కల్పించడంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా ఎమ్మెల్యేతోపాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పోలీసులు ఢాం, ఢాం అంటూ నినాదాలు చేశారు. దీంతో కార్యకర్తల మధ్య పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

అయితే, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌‌లో దుబ్బాక సీఐ, ఎమ్మెల్యే రఘునందన్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ, ఎస్టీలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఎమ్మెల్యే నాలుగు గంటలుగా స్టేషన్‌లోనే కుర్చున్నారు. అంతేకాకుండా తొగుట మండలం గుడికందులలో పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మెలిగారని రఘునందన్ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు స్టేషన్‌లోకి రాకుండా పోలీసులు గేటు మూసివేశారు. దీంతో స్టేషన్‌లోనే వంటా వార్పునకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి మిరుదొడ్డి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని ఎమ్మెల్యే రఘునందనను కోరారు. అయితే, సీపీ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఏసీపీ దేవారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మిరుదొడ్డి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.