అంబేద్కర్ కోనసీమ పేరుపై ఓటింగ్.. రఘురామ డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

అంబేద్కర్ కోనసీమ పేరుపై ఓటింగ్.. రఘురామ డిమాండ్

May 25, 2022

ఏపీలోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టడంపై వివాదానికి ముగింపు పలకాలంటూ వైకాపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కొన్ని సలహా ఇచ్చారు. జగన్ ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేసినప్పుడే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఆ గొడవ జరిగేది కాదన్నారు. ‘అంబేద్కర్‌ను అన్ని కులాలు అభిమానిస్తాయి. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. జగన్ సర్కారు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని బ్యాలెట్ పోలింగ్ నిర్వహించాలి. లాటరీ ద్వారా కొన్ని ప్రాంతాలను ఎంచుకుని లక్ష మంది అభిప్రాయాలు తీసుకోవాలి. వీలు కాకపోతే మొత్తం జిల్లా అంతటా ఓటింగ్ జరపాలి. ఓటింగ్ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు’ అని రఘురామ అన్నారు. అమలాపురం విధ్వంసకాండలో పాల్గొన్నది సాయి అనే వ్యక్తి అని అందరూ చెప్పుకుంటున్నారన్నారు. అతనితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోటో దిగారని వెల్లడించారు.