ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉంది..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉంది.. 

May 22, 2020

Raghuram Rajan says Centre’s economic package inadequate, giving free foodgrains not enough

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వలస కార్మికుల ఉచిత ఆహార ధాన్యాలకే సరిపోతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులకు ఉచిత నగదు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ 4.0 అమలు అవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. కార్మికులకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వివిద రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోకపోతే.. ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని రాజన్‌ హెచ్చరించారు.

విప్లవాత్మక సంస్కరణలు చేపడితేనే ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. రేటింగ్‌ ఏజన్సీలు ఇచ్చే నివేదికలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని  అన్నారు. మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని.. బ్యాంకులు, సూక్ష్మ మధ్య స్థాయి పరిశ్రమలకు ప్రభుత్వం భరోసా కల్పించే ప్రణాళికలు రచించాలని వెల్లడించారు.