అదరగొట్టిన రాహుల్.. ఓడిన ముంబై - MicTv.in - Telugu News
mictv telugu

అదరగొట్టిన రాహుల్.. ఓడిన ముంబై

April 16, 2022

rahul

ఐపీఎల్ 15 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోర పరాజయాలు చవిచూస్తుంది. దీంతో ముంబై అభిమానులు తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు. ఐపీఎల్ మొదలైన రోజు నుంచి నేటీవరకు ముంబై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శనివారం జరిగిన మ్యాచులోనైనా ముంబై గెలుస్తుందని కలగన్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ముంబై వరుసగా ఆరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. లఖ్నవూతో నేడు జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి, 181 పరుగులకే పరిమితమైంది. దీంతో లఖ్నవూ జట్టు నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబై బ్యాటర్లలో సూర్య కుమార్ యాదవ్ (37), డెవాల్డ్ బ్రేవీస్ (31), తిలక్ వర్మ (28), కీరన్ పొలార్డ్ (25) రాణించారు.

అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (6), ఓపెనర్ ఇషాన్ కిషన్ (13), పేబియన్ అలెన్ (8), జయదేవ్ ఉనద్కత్ (14), మురుగన్ అశ్విన్ (6) పరుగులు చేశారు. బుమ్రా (0), టైమల్ మిల్స్ (0) నాటౌట్‌గా నిలిచారు. లఖ్నవూ బౌలర్లలో అవేవ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. జేసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్, దుష్మంత చమీర తలో వికెట్ పడగొట్టారు.

మొదటగా బ్యాటింగ్ చేసిన లఖ్నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (103* : 60 బంతుల్లో 9×4, 5 6) శతకంతో చెలరేగాడు. మనీశ్ పాండే (88), క్వింటన్ డి కాక్ (24) ఫర్వాలేదనిపించారు. మార్కస్ స్టోయినిస్ (10), దీపక్ హుడా (15) పరుగులు చేశారు. కృనాల్ పాండ్య (1) నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా, మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ చెరో వికెట్ పడగొట్టారు.