తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు : రాహుల్ గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు : రాహుల్ గాంధీ

February 5, 2020

hcvbnm

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఘాటైన విమర్శలు చేశారు.  ఏదో ఒక రోజు తాజ్‌మహల్‌ కూడా అమ్మేస్తారని వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాంగ్‌పూర్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరుసగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా,ఎల్ఐసీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయన తాజ్‌మహల్ అమ్మేయడంపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి. 

ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం విధ్వేషాలను నింపుతోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అని కేవలం మాటలకు మాత్రమే ఆయన పరిమితం అయ్యారని, చేతలు మాత్రం శూన్యమన్నారు. మోదీ మేకిన్ ఇండియా నినాదం ప్రచారానికే పరిమితమైందని, ఆగ్రాకు ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదని రాహుల్ అన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రజలను మోసగిస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు అధికారం కోసమే పని చేస్తున్నాయి తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.