ఆస్ట్రేలియాలోని పెర్త్ హోటల్‌లో కోహ్లీ రూం వీడియో బయటకు రావడంపై పెద్ద దుమారం రేగింది. దీనిపై విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూడొద్దని ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసాడు.వెంటనే స్పందించిన హోటల్ యాజమాన్యం విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్పడం, వీడియో తీసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం చకాచకా జరిగిపోయాయి.
తాజాగా ఈ ఘటనపై తాజాగా టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. ఇది తీవ్ర అసహనం కలిగించే అంశం అని, విరాట్ ఒక్కడికే కాదు, ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కోహ్లీ స్పందించిన తీరును రాహుల్ ద్రవిడ్ సమర్థించాడు.ఈ ఘటన పట్ల అతడు ఎంతో హుందాగా నడుచుకున్నాడని, ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాడని వివరించారు.పబ్లిక్ ప్లేస్ లో ప్రైవసీ దొరకని ప్లేయర్లకు కనీసం వారి గదిలో కూడ స్వేచ్ఛ లేకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగించే విషయం అని ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.