భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమార్ అన్వయ్ ద్రవిడ్ జోనల్ టోర్నమెంట్ లో కర్ణాటక అండర్ 14 జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
అన్వయ్ కర్ణాటక తరుపున జూనియర్ లెవల్ లో క్రికెట్ ఆడుతున్నాడు. అతను తన బ్యాట్ తో ఇప్పటికి చాలా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఆస్తకిరమైన విషయం ఏమిటంటే.. రాహుల్ లాగే.. అన్వయ్ కూడా వికెట్ కీపర్. రాహుల్ చాలాకాలం పాటు టెస్టులు, వన్డేల్లో టీమ్ ఇండియాకు ఫుల్ టైమ్ వికెట్ కీపర్ గా ఉన్నాడు. వికెట్ కీపర్ – బ్యాట్స్ మెన్ కోసం భారత్ కష్టపడుతున్నప్పుడు రాహుల్ అలవోకగా ఆ పని చేసి చూపించాడు. ఎంఎస్ ధోనీ రాకతో ద్రవిడ్ తన కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు.
అన్వయ్ క్రికెట్ కొత్తవాడు. కానీ తండ్రి రికార్డులను బద్దలు కొట్టడానికి మాత్రం ఎదురుచూస్తున్నాడు. అన్వయ్ అన్నయ్య సమిత్ కూడా క్రికెటర్. 2019, 2020 సీజన్ లో యూ-14 స్థాయిలో రెండు డబుల్ సెంచరీలు కొట్టి అందరి దృష్టి ఆకర్షించాడు. సమిత్ ఇప్పటికే తన జట్టులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అన్వయ్ కూడా తండ్రి, అన్నయ్య అడుగు జాడల్లో నడుస్తూ వారికి మంచి పేరు తేవాలని కృషి చేస్తున్నాడు.
రెండో వన్డేకు సిద్ధమైన టీమిండియా..
రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోనే టీమిండియా ఇప్పుడు న్యూజిల్యాండ్ తో రెండో వన్డేకు సిద్ధమైంది. హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజిల్యాండ్ పై భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో వన్డే శనివారం (జనవరి 21) రాయ్ పూర్ లో జరుగనుంది. మూడవ వన్డే జనవరి 24న ఇండోర్ లో జరుగుతుంది.