మోడీకి నొప్పి తెలియడం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

మోడీకి నొప్పి తెలియడం లేదు

October 30, 2017

దేశ ప్రజల బాధను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారని  కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు ఘోర వైఫల్యం అయితే ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన టార్పడో[వాటర్ మిస్సైల్] జిఎస్టీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశమైన రాహుల్, నోట్ల రద్దు, జిఎస్టీ తో దేశానికి మోడీ రెండు భారీ షాకులిచ్చారని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, చిన్న వ్యాపారాలు మూతపడ్డాయన్నారు. చాలా దారుణమైన పద్దతిలో జిఎస్టీని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. నవంబర్ 8 తారీఖును యాంటీ బ్లాక్ మనీ డే గా చూస్తామన్న కేంద్రప్రభుత్వ ప్రకటనను కూడా రాహుల్ తప్పుపట్టారు. నవంబర్ 8 ఓ విషాద దినం అన్నారు.