గ్యాంగ్‌రేప్ బాధితురాలికి రాహుల్ పరామర్శ - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాంగ్‌రేప్ బాధితురాలికి రాహుల్ పరామర్శ

May 16, 2019

సామూహిక అత్యాచారానికి గురైన దళిత మహిళను ఈరోజు పరామర్శించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఆమెతో, ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా వెళ్లారు.

ఈ సందర్భంగా మీడియాతో రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదు. బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వచ్చాను. ఆమెకూ, ఆమె కుటుంబానికి న్యాయం జరుగుతుంది. బాధితురాలి కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు మాట్లాడాను. వాటిని బయటకు చెప్పలేను’ అని తెలిపారు రాహుల్ గాంధీ.

ఏప్రిల్ 26 న ఆల్వార్‌లో బాధితురాలు తన భర్తతో కలసి బైక్‌పై వెళ్తుండగా… దారి మధ్యలో  దుండగులు వారిని అడ్డుకున్నారు. భర్తపై దాడి చేసిన భార్యను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. భర్తముందే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.