తెలంగాణ: నేటితో ముగియనున్న భారత్ జోడో యాత్ర - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: నేటితో ముగియనున్న భారత్ జోడో యాత్ర

November 7, 2022

Rahul gandhi Bharat Jodo Yatra will end today in Telangana.

 

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో తెలంగాణ రాష్ట్రంలో ముగియనుంది. అక్టోబర్ 23న కర్ణాటక నుంచి తెలంగాణలోని మక్తల్‌లో భారత్ జోడో యాత్ర అడుగుపెట్టింది. ఈ యాత్రకు తెలంగాణ ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్‌ పాదయాత్ర.. మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర ఇవాళ్టితో 375 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది.

ఈనేపథ్యంలో.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను నేతలు తరలిస్తున్నారు. సభ అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్‌లో రాహుల్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది. తెలంగాణలో మేనూరు వద్దే పాదయాత్ర ముగుస్తుండడంతో టీపీసీసీ కమిటీ బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. సుమారు లక్ష మందికి పైగా జనాలతో రాహుల్‌ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలకాలని టీపీసీసీ భావిస్తోంది. సభ అనంతరం భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకోనుంది. రాత్రి 9.30కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్.. మహారాష్ట్ర పీసీసీ కి జాతీయ జెండాను అందించనున్నారు