rahul gandhi bowling video
mictv telugu

రాహుల్ గాంధీ సూపర్ బౌలింగ్ వీడియో ఇదిగో..

November 2, 2022

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో జోరుగా సాగుతోంది. పార్టీకి పూర్వవైభవమే తేవడమే లక్ష్యంగా రాహుల్ ముందుకు సాగుతున్నారు. రాహుల్ వెంట పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు . అన్ని వర్గాలను కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్న రాహుల్ . రన్నింగ్ చేస్తూ, డ్యాన్స్ వేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా ఓ బాలుడితో క్రికెట్ ఆడి ఆశ్చర్యపరిచారు.

సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రామచంద్రపురం ఇక్రిశాట్ వద్ద ఓ బాలుడితో క్రికెట్ ఆడారు. బాలుడు బ్యాటింగ్ చేయగా రాహుల్ బౌలింగ్ వేసాడు. పార్టీ నేతలను చుట్టూ ఫ్లీల్డింగ్ పెట్టి బంతులు విసిరారు.. ఈ వీడియో చూసిన వారంతా ఇది చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు బంగ్లాదేశ్‌పై గెలిచిన టీం ఇండియాకు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు.