రాహుల్ గాంధీపై రాళ్లు...వేసింది ఎవరో ? - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ గాంధీపై రాళ్లు…వేసింది ఎవరో ?

August 4, 2017

గుజరాత్ లోని బనస్కంత ప్రాంతం లో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పై దాడి జరిగింది,తీవ్రమైన వరదలు ముంచెత్తడం తో వరద ప్రాంతాలలో రాహుల్ గాంధీ పర్యటించి బాధితులను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం గుజరాత్ లోని బనస్కంత్ లో పర్యటించారు, ఆయన ప్రయాణిస్తున్న బులెట్ ఫ్రూఫ్ కార్ పైన ఇటుకలు..కంకర రాళ్లతో దాడి చేశారు. దీంతో అద్దాలు పగిలి కారు బాగా ధ్వంసం అయింది.అప్రమత్తమైన రాహుల్ ప్రత్యేక సిబ్బంది,రాహుల్ గాంధీని వారి రక్షణ వలయంలో అక్కడినుంచి తీసుకెళ్లారు.ఈదాడి వెనుక అధికారంలో ఉన్న బిజెపి హస్తం ఉందని కాంగ్రెస్ వాళ్లు అంటే… గుజరాత్ బిజెపీ సీనియర్ నేత కైలాష్ విజయ్ వర్గియా స్పందిస్తూ  దానికీ మాకు ఏం సంభందంలేదు..నిజంగా జరిగిందో లేక పథకం ప్రకారం  మీరే కావాలని చేయించుకున్నరో మాకు తెలియదు అని అన్నారు.

ఈ దాడిపై ట్విట్టర్ లో స్పందించిన రాహుల్ గాంధీ..!

ప్రధాన మంత్రి స్వంత రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై  రాహుల్ ట్విట్టర్ లో స్పందించారు…“నరేంద్ర మోడీ జీ, స్లోగన్ లు,నల్ల జెండాలు ,రాళ్లు వేసినంత మాత్రానా మేం వెనక్కి తగ్గం, ప్రజలకు సాయం చేసే విషయంలో మాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్తాం” అని రాహుల్ తన ట్విట్టర్లో స్పందిచారు.