Rahul Gandhi condemned Digvijay's comments on surgical strikes
mictv telugu

దిగ్విజయ్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన రాహుల్.. అనుమానం లేదని వివరణ

January 24, 2023

Rahul Gandhi condemned Digvijay's comments on surgical strikes

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ పార్టీ మరో నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. సాయుధ దళాల సామర్ధ్యంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆధారాలు అడిగిన దిగ్విజయ్ మాటలను కొట్టిపారేశారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప పార్టీ అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. ‘సైనిక దళాలు అనూహ్యంగా దాడి చేయగలవు. వారి కెపాసిటీ నాకు తెలుసు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు’ అని వివరణ ఇచ్చారు. కాగా, 2019లో పాకిస్తాన్‌లో సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌‌పై దిగ్విజయ్ ఆధారాలు అడిగారు. ఇంతమందిని చంపామంటూ కేంద్ర ప్రభుత్వం కబుర్లు చెప్తుంది తప్ప ఎలాంటి రుజువులు చూపించడం లేదని విమర్శించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి సైన్యంపై నమ్మకం లేదని, రాహుల్ అభిప్రాయాలే దిగ్విజయ్ రూపంలో బయటికి వచ్చాయని తిట్టిపోశారు. దీంతో రాహుల్ గాంధీ వివరణ ఇస్తూ ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టారు.