సంతృప్తిగా ఉంది.. రాహుల్   - MicTv.in - Telugu News
mictv telugu

సంతృప్తిగా ఉంది.. రాహుల్  

December 18, 2017

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని కాంగ్రెస్ పేర్కొంది. ఫలితాలు తనకు సంతృప్తినిచ్చాయని పార్టీ అధ్యక్షుడు రాహల్  గాంధీ చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు. ఆ రాష్ర్టాల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలకు ఆయన అభినందనలు తెలిపారు.

‘నా ప్రేమను చూపిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు థ్యాంక్స్. కాంగ్రెస్ సోదరసోదరీమణులు నేను గర్వపడేవిధంగా పనిచేశారు. మీరు చాలా విభిన్నమైన వారు..  హుందాతనంతో ఎన్నికల్లో పోరాడారు.  కాంగ్రెస్ పార్టీ గొప్పతనం దాని శౌర్యం, హుందాతనంలోనే ఉన్నదని నిరూపించారు..’ అని కార్యకర్తలను కొనియడారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి 99, కాంగ్రెస్‌కు 77 స్థానాలు వచ్చాయి. బీజేపీ గుజరాత్‌లో 100 సీట్లు దాటడానికి నానా తంటాలు పడిందని, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్‌ అన్నారు.  ఓడిన నైతిక విజయం మాత్రమ తమదేనన్నారు.