నోట్లరద్దును రాహుల్ ఎలా అమలు చేసేవాడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

నోట్లరద్దును రాహుల్ ఎలా అమలు చేసేవాడంటే..

March 10, 2018

నోట్లరద్దుతో దేశ ప్రజలు ఎన్ని అగచాట్లు పడ్డారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏటీఎంaలో, బ్యాంకుల్లో డబ్బు దొరక్క, రెండువేల నోట్లకు చిల్లర దొరక్క అలమటించారు. ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలు విపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాnr. ఆ రచ్చ ఇంకా కొనసాగుతోంది.

మోదీ నోట్లరద్దును సరిగ్గా అమలు చేయలేదు సరే, మరి మీరు ఎలా అమలు చేసి ఉండేవారు అని సింగపూర్లో పర్యటిస్తున్న రాహుల్‌ను శనివారం ఓ విలేకరి అడిగాడు. అందుకు ఆయన మనం ఊహించని సమాధానం చెప్పాడు.

‘నేను కనుక ప్రధానమంత్రిని అయ్యుంటే .. నోట్లను రద్దు చేయాలంటూ ఎవరైనా సంతకం కోసం ఒక ఫైలును నాకు ఇచ్చి ఉంటే దాన్ని చెత్తబుట్టలోకి విసిరికొట్టేవాడిని. నోట్లరద్దుకు అదే తగిన శాస్తి’ అని రాహుల్ బదులిచ్చారు.