రాహుల్ ట్వీట్లు చేసేది ఓ కుక్కంట! - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ ట్వీట్లు చేసేది ఓ కుక్కంట!

October 30, 2017


ఎవరో రాసిన ప్రసంగాలు చదువుతారన్నది కాంగ్రెస్ నేత రాహుల్‌పై ఉన్న విమర్శ. ఆయన ఆయన కొంతకాలంగా ఇలాంటి ప్రసంగాల జోలికి పోకుండా ఆశువుగా మాట్లాడుతున్నాడు. సభల్లో మోదీ సర్కారును చెండాడుతున్నారు. పదునైన ట్వీట్లు కూడా విసురుతున్నారు.  ఆయనలో ఈ మార్పు ఎలా వచ్చిందబ్బా బీజేపీ నేతలు కంగుతింటున్నారు. దీనివెనక ఎవరో ఉన్నారని ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు. దీనికి రాహుల్ తాజాగా ఘాటు సమాధానం ఇచ్చారు. తన ట్వీట్లను తన పెంపుడు కుక్క పిడి పెడుతోందని వ్యంగ్యాస్త్రం సంధించారు. కుక్క వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇతని కోసం రోజూ ఎవరు ట్వీట్లు చేస్తున్నరబ్బా అని చాలా మంది అడుగుతున్నారు. నేరుగా చెప్పేస్తున్నాను. అది నేనే. నా పేరు పిడి. నేను అతని(రాహుల్) కంటే స్మార్ట్‌. ట్వీట్‌తో నేను ఏం చేయగలనో చూడండి.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు

రాహుల్ పోస్ట్ చేసిన వీడియోలో పిడి.. రాహుల్ చెప్పినట్టు చేస్తోంది. రాహుల్ ముందుగా దానితో ‘నమస్తే’ చెప్పించాడు. తరువాత దాని ముక్కుపై బిస్కెట్ ముక్క పెట్టారు. తర్వాత అది లటుక్కున్న ఆ ముక్కను మింగేసింది. గుడ్ బాయ్ అని రాహుల్ దాన్ని అభినందించారు. ఆ వీడియో మీరూ చూడండి..