రాహుల్‌ మెడపైకి గురిచూసి వదిలాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్‌ మెడపైకి గురిచూసి వదిలాడు..

April 6, 2018

అభిమాన నేతలు కనిపిస్తే చాలు జనం ఉప్పొంగిపోతారు. కొందురు పూలు చల్లుతారు, కొందరు షేక్ హ్యాండ్ తీసుకుంటారు. ఏమేమో చేస్తారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అమితంగా అభిమానించే ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. అతని నైపుణ్యానికి జనం అబ్బురపడిపోతున్నారు. రాహుల్ మెడను గురిచూసి అతడు విసిరిన పూలదండ ఏంతో కంప్యూటర్ ప్రోగ్రామ్ సెట్ చేసి వెళ్లి రాహుల్ మెడలో ఒదిగిపోయింది. ఎక్కడినుంచి వచ్చిపడిందంబ్బా అని రాహుల్ కూడా షాక్ తిన్నాడు. తర్వాత దాన్ని పక్కనపెట్టి ప్రచారం సాగించారు.గురువారం తుమ్‌కూరులో ఈ సంఘటన జరిగింది. వ్యాన్‌లో నిల్చొని అభిమానులకు అభివాదం చేస్తున్న రాహుల్‌ మెడలో పూలదండ వచ్చింపడింది. దీన్ని కాంగ్రెస్ నాయకురాలు, నటి దివ్య స్పందన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా, వీఐపీ లిస్టులో ఉన్న రాహుల్ భద్రతకు ఇలాంటి వాటివల్ల ప్రమాదం వాటిల్లే అవకాశముందని కాంగ్రెస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.