దళితులపై దాడులు.. రాహుల్ నిరాహార దీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

దళితులపై దాడులు.. రాహుల్ నిరాహార దీక్ష

April 9, 2018

ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు, ఆయన హయాంలో దళితులపై పెరిగిన దాడులకు నిరసనగా కాంగ్రెస్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టింది. ఢిల్లీలోని సోమవారం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర అగ్రనేతలు దీక్షకు దిగారు. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించిన అనంతరం దీక్షకు కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలోను కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు నిర్వహిస్తున్నాయి.

దళితులపై పెరుగుతున్న దాడులు, బ్యాంకుల కుంభకోణాలు, సీబీఎస్‌ఈ పరీక్షా పత్రాలు లీక్, పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్ దీక్షలు చేస్తోంది. ఢిల్లీ దీక్షలో అజయ్ మాకెన్, దిగ్విజయ్ సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. కాగా, దీక్షలో కూర్చున్న నేతల్లో కొందరు పొద్దున్న అల్పాహారం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని ఫొటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాహుల్ ఈ ఫొటోల్లో లేరు