వీడియో : పబ్బులో రాహుల్ గాంధీ.. తీవ్ర విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : పబ్బులో రాహుల్ గాంధీ.. తీవ్ర విమర్శలు

May 3, 2022

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన పబ్బులో ఉన్న వీడియో చూసి నెటిజన్లు, వివిధ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. ‘ఇలాంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్ధులకు ఏం చెప్తాడు? కాంగ్రెస్ పార్టీ విద్యార్ధులను ఏం చేయాలి అనుకుంటుంది? అంటూ టీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేస్తున్నారు. పబ్బులో ఎంజాయ్ చేసే నాయకుడిపై అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకొని తెలంగాణకు ఆహ్వానించారా? అంటూ బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాగా, పబ్బులో రాహుల్ గాంధీ పక్కన అమ్మాయితో పాటు మందు సీసా కూడా ఉండడం పై వీడియోలో చూడొచ్చు.

కాగా, ఈ వీడియో నేపాల్ రాజధాని ఖాట్మండులో తీసింది. రాహుల్ గాంధీ తన జర్నలిస్ట్ ఫ్రెండ్ అయిన సుమ్నీమా ఉదాస్ వివాహ వేడుక కోసం ఖాట్మండు వెళ్లారు. అక్కడి మారియట్ హోటల్‌లో బస చేశారు. సుమ్నీమా తండ్రి భూమ్ ఉదాస్ మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ పక్కనున్న అమ్మాయి నేపాల్‌లో చైనా రాయబారి హౌ యాంకీ అని, గతంలో నేపాల్ ప్రధానిపై హనీ ట్రాప్ చేసి నేపాల్‌ను భారత్‌కు దూరంగా ఉంచడంలో కీలక పాత్ర వహించిందని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. దేశ భద్రత విషయంలో రాహుల్ గాంధీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది. ఈ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ నుంచి వివరణ రావాల్సి ఉంది.