కాంగ్రెస్ పార్టీలో యువరాజు, రాకుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ వయసు దాటుతున్నా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీనిపై చాలా సార్లు అడిగినా రాహుల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ గానే ఉండిపోయారు. అయితే తాజాగా తనకు కావాల్సిన అమ్మాయిలో ఉండాల్సిన లక్షణాల గురించి రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ ఛానెల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీల గుణాలు, లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా. నాయనమ్మను నేను రెండో అమ్మగా భావిస్తా. ఇద్దరి గుణాలు ఉన్న అమ్మాయి ఉండడం మాత్రం అరుదు’ అంటూ బదులిచ్చారు. దాంతో పాటు సైకిల్, మోటార్ సైకిల్ నడపడం తనకు ఇష్టమని, సొంత కారు లేకున్నా రైడ్ కి వెళ్లడాన్ని ఇష్టపడతానని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.