గుజరాత్ మోడల్ గాలిబుడగే - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్ మోడల్ గాలిబుడగే

November 1, 2017

రోడ్ల మీద నానో కార్లు, గుజరాత్‌లో అభివృద్ధి రెండూ కనిపించడం లేదని కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అన్నారు.బీజేపీపై గుజరాతీలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. గుజరాత్ జంబూసర్‌లో మూడో రోజు ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ నిర్వహించారు. టాటా నానో ప్రాజెక్టు కోసం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోడీ 33 వేల కోట్ల రూపాయలను సబ్సిడీగా ఇచ్చారని, అయినా ఇప్పుడు ఎక్కడా ఆ కార్లే కనిపించడం లేదన్నరు. నానా కార్లతో పాటు మోడీ చెప్పిన అభివృద్ధి కూడా కనిపించడం లేదన్నారు. గుజరాత్ మోడల్ ఒట్టి గాలి బుడగే అన్నారు. తమకు నచ్చిన బిజినెస్ మెన్‌ల ఫాయిదా కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  పనిచేస్తున్నాయని విమర్శించారు.