రాహుల్ సాయంతో పైలట్ అయిన నిర్భయ సోదరుడు - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ సాయంతో పైలట్ అయిన నిర్భయ సోదరుడు

November 2, 2017

దేశ రాజధాని ఢిల్లీలో 2012లో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ సోదరుడు.. ఆటుపోట్లను ఎదుర్కొని పైలట్ అయ్యాడు. రాహుల్ గాంధీ చేయూతతో తన కల నెరవేర్చుకున్నాడు. నిర్భయ తల్లి ఆశాదేవి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. రాహుల్ గాంధీకి హృదయ పూర్వక  కృతజ్ఞతలు తెలిపింది. రాహుల్ గాంధీ సాయం వల్లే తన బిడ్డ ఈ స్థాయికి చేరుకున్నాడని పేర్కొంది.

‘నిర్భయపై ఆ పాశవికం జరిగిన నాటికి నా కొడుకు అమన్ (పేరు మార్చాం)కు 19 ఏళ్లు. అక్క మరణంతో కుంగి పోయాడు. రాహుల్ అతనికి ఫోన్ చేసి మాట్లాడారు. కౌన్సెలింగ్ ఇప్పించారు.  పైలట్‌ ట్రైనింగ్‌ కోర్సు చేయాలని చెప్పారు. 10వ తరగతి పూర్తవగానే నా కొడుక్కి  రాయ్‌బరేలీలోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్‌ అకాడమీలో సీటు ఇప్పించారు.

కానీ అమన్‌ మాత్రం చదువుపై ఆసక్త  కనబరచలేదు. రాహుల్‌ ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. మిలటరీ చేరాలన్నది అమన్ కోరిక. అలా రాహుల్ అండదండలతో  పైలట్‌ శిక్షణ పూర్తి చేశాడు’ అని ఆమె తెలిపింది. అమన్ నేవీలో చేరబోతున్నట్లు వెల్లడించింది. రాహుల్ చెల్లెలు ప్రియాంక గాంధీ తమకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారని తెలిపింది. కాగా, నిర్భయ తండ్రి ఢిల్లీ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చిన్న కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడు.