జర్నలిస్టుగా మారనున్న రాహుల్.. రేపట్నుంచే.. - MicTv.in - Telugu News
mictv telugu

జర్నలిస్టుగా మారనున్న రాహుల్.. రేపట్నుంచే..

July 13, 2020

Rahul Gandhi.

ఇంతకాలం రాజకీయ నేతగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపటి నుంచి జర్నలిస్టుగా మారనున్నారు. నమ్మబుద్ధి కాకపోయినా రేపటినుంచి ఆయన చదివే వార్తలు మనం చూడాల్సిందే మరి. రాజకీయాలను వదిలిపెట్టి ఆయన ఉన్నపళంగా ఏ న్యూస్ ఛానల్‌లో చేరుతున్నారనే అనుమానం కలుగుతోంది. అదేంకాదు, ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోల ద్వారా వార్తలు చదవనున్నారన్న మాట. భారతీయ మీడియాపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాహుల్ గాంధీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవాస్తవాలను మీడియా వాస్తవాలుగా ప్రచారం చేస్తోందని ఆయన వీడియో సందేశాల ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియ పరుస్తాను అంటున్నారు. భారత్‌లోని న్యూస్ ఛానల్స్ అన్నీ మోదీకి లొంగిపోయాయని.. దేశ ప్రజల అవసరాల గురించి అవి పట్టించుకోవడం లేదని ఆయన గత కొంత కాలంగా తీవ్రంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇకపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా పాత్ర తానే పోషించబోతున్నట్లు స్పష్టంచేశారు. ‘నేడు భారత్ మీడియా ఎక్కువ భాగం నియంతృత్వ ప్రయోజనాలకు అనుకూలంగా ప్రచారం చేయడానికే పని చేస్తోంది. టీవీ ఛానళ్లు, వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌ల ద్వారా తప్పుడు, ధ్వేషపూరిత కథనాలను వ్యాపింపజేస్తున్నారు. దేశాన్ని ముక్కలు చేయడంలో ఈ అబద్ధాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అందుకే దేశ ప్రజలకు నేనే వాస్తవాలను అందించాలని నిర్ణయించుకున్నాను. రేపటి నుంచి కరెంట్ ఎఫైర్స్, చరిత్ర, సంక్షోభాల గురించి వీడియో సందేశాల ద్వారా నా అభిప్రాయాల్ని తెలియజేస్తాను’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు.