ఈ ఏడాది పార్లమెంట్ వింటర్ సెషన్స్ కు కాంగ్రెస్ నాయకులు డుమ్మా కొడుతున్నారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా పాదయాత్ర చేస్తున్నారు. దీని కారణంగాగానే శీతాకాలం సమావేశాలకు వీళ్ళు హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో….పార్లమెంటు సమావేశాల కన్నా జోడో యాత్ర చేయడమే ముఖ్యమంని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. జోడో యాత్రతోనే ప్రజలకు మరింత దగ్గరవుతున్నామని వాళ్ళు చెబుతున్నారు.
దిగ్విజయ్ సింగ్ తో పాటూ దాదాపు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరూ వింటర్ సెషన్స్ కు అటెండ్ అవడం లేదు. వచ్చే బుధవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శీతాకాంల సమావేశాలు ఈసారికి పాత పార్లమెంటు భవన్ లోనే జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్లనే ఈసారి సమావేశాలు ఒక నెల ఆలస్యంగా మొదలవుతున్నాయి.
మరోవైపు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్గాల సమావేశం జరగనుంది. రాజ్యసభ సభ్యులందరూ ఈ మీటింగ్ పాల్గొననున్నారు. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎల్వోపీగా కొనసాగాలా లేదా అనే దానిపై ఈ మీటింగ్ నిర్ణయం తీసుకోనున్నారు. సోనియా గాంధీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని కాంగ్రెస్ అధికార వర్గాలు తెలిపాయి.