నా వల్లే ఓటమి, రాజీనామా చేస్తా.. ఊరుకో రాహుల్! - MicTv.in - Telugu News
mictv telugu

నా వల్లే ఓటమి, రాజీనామా చేస్తా.. ఊరుకో రాహుల్!

May 25, 2019

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ పార్టీ అధినేతలు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో ఢిల్లీలో కొనసాగుతోంది. ఓటమికి బాధ్యత వహిస్తూ తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్ గాంధీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పెద్దలు ఆయన నచ్చజెప్పినట్లు సమాచారం. అయితే రాహుల్ రాజీనామా ప్రతిపాదనేదీ చేయలేదని పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పుకొచ్చారు.

Rahul Gandhi propose to resign congress president cwc rejects as brainstorming continuous on defeat in parliamentary elections

నిజానికి ఈ నెల 23న ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్న సమయంలో రాహుల్ రాజీనామా ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఆ నిర్ణయం సరికాదని తల్లి సోనియా గాంధీ వారించారు. ఈ రోజు సీడబ్ల్యూసీ సమావేశంలో మళ్లీ ఈ అంశం మళ్ల తెరపైకి వచ్చింది. పార్టీ ఓటమికి సమష్టి బాధ్యత తీసుకుని మళ్లీ బలోపేతం కావాలని నిర్ణయించారు. భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 52 సీట్లు మాత్రమే దక్కాయి.