Rahul Gandhi receives anonymous threat
mictv telugu

రాహుల్ గాంధీని బాంబులతో లేపేస్తాం..

November 18, 2022

కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటన పూర్తయ్యాక మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీని బాంబులతో చంపేస్తామంటూ లేఖ ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. జోడోయాత్ర సాగే మార్గంలోని ఓ స్వీట్ షాపులో రాహుల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ కనిపించడం సంచలనమైంది. రాహుల్‌తో పాటు కమల్ నాథ్‌ను కూడా లేపేస్తాం అని లేఖలో ఉండడం భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. దీనిని ఆకతాయి పనిగా భావించిన పోలీసులు.. ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. లేఖను వదిలిన వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానిక సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈనెల 24న ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో రాహుల్ గాంధీ బస చేయనున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు.