అమ్మ ఆరోగ్యం ఆందోళన అక్కర్లేదు - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మ ఆరోగ్యం ఆందోళన అక్కర్లేదు

October 28, 2017

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యం ప్రస్తుతం కొంచెం బాగానే ఉందని ఆమె తనయుడు రాహుల్ గాంధీ తెలిపారు. ‘ఆమ్మ ఆరోగ్యంపై ఆందోళనపడాల్సిన అవసరం లేదు..

మీరు మాపై చూపుతున్న అదరాభిమానాలకు ధన్యావాదాలు’ అని అన్నారు. సోనియా శుక్రవారం ఉదర సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఏర్పాట్ల కోసం సిమ్లా వెళ్లిన సోనియా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. సోనియా ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. చికిత్స కోసం అమెరికాకు వెళ్లివస్తున్నారు. దీంతో పార్టీ పగ్గాలను త్వరలోనే ఉపాధ్యక్షుడైన రాహుల్‌కు కట్టబెట్టే అవకాశముంది.