Rahul Gandhi:భారత్ జోడో యాత్రలో ఫుల్ గడ్డంతో , జుట్టుతో, హాఫ్ స్లీవ్స్ వైట్ టీ షర్టుతో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా సరికొత్త లుక్ లో దర్శనమిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఉపన్యాయం ఇచ్చేందుకు యూకే వెళ్లిన రాహుల్ గాంధీ, తన లుక్ ను పూర్తిగా మార్చుకుని మరోసారి నెట్టింట్లో చర్చనీయాంశంగా మారారు. భారీగా పెరిగిన గడ్డాన్ని తీసేసి, నున్నగా హెయిర్ కట్ చేసుకుని , బ్లాక్ కలర్ సూట్ ధరించి, మెడలో టై కట్టుకుని లెక్చరర్ గా కనిపిస్తూ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు రాహుల్.
నెట్టంట్లో ప్రస్తుతం రాహుల్ గాంధీ న్యూ లుక్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. కేంబ్రిడ్జ్ లో రాహుల్ లెక్చర్ విన్న విద్యార్ధులు గాంధీ పిక్స్ ను సెల్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట చేశారు. ఇంతలో ఎంత మార్పు అంటూ నెటిజన్లు ఈ పిక్స్ కు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. గాంధీ కొత్త లుక్‌కి సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ నేతలు ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఉపన్యాసం ఇచ్చేందుకు యూకే చేరుకున్నారు. యూకే పర్యటనకు ముందే తాను మేక్ఓవర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంబ్రిడ్జ్ లో విద్యార్థులను ఉద్దేశించి 21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిసన్ అనే అంశంపై ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ. అంతే కాదు రాహుల్ గాంధీ యూనివర్సిటీ కార్పస్ క్రిస్టీ కాలేజీలో బిగ్ డేటా డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలు అనే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లండన్ లో వారం రోజులు పర్యటించనున్న రాహుల్ గాంధీ మార్చి 5న లండన్‌లోని భారతీయ ప్రవాసులతో కూడా సంభాషించనున్నారు. అంతేకాదు లండన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులను కలవనున్నారు.