తెలంగాణలో ప్రారంభమైన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ప్రారంభమైన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’

October 23, 2022

 

Rahul Gandhi’s Bharat Jodo Yatra to enter Telangana today

తెలంగా రాష్ట్రంలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. రాయచూర్ నుంచి మక్తల్‌ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. కాంగ్రెస్‌ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మ బోనాలు, డోలు వాయిద్యాలతో ఘనంగా ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ జాతీయజెండా అందించారు.

ఐదు కిలోమీటర్లు పాదయాత్ర తర్వాత ఉదయం 11 గంటల సమయంలో గూడబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టైరోడ్‌కు చేరుకుంటారు. టైరోడ్‌ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సమీపంలోనే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. తిరిగి ఈ నెల 27న రాష్ట్రానికి చేరుకుని పాదయాత్రను కొనసాగిస్తారు.

దీపావళి కారణంగా 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఇచ్చారు.ఈనెల 26 ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణస్వీకారంలో రాహుల్ పాల్గొంటారు. ఈనెల 27నుంచి నుంచి రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. తెలంగాణలో 12 రోజులు పాటు 375 కి.మీ. యాత్ర సాగనుంది. 7పార్లమెంట్ స్థానాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా భారత్‌ జోడో యాత్ర సాగనుంది.