కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తన వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యే ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన సోదరి ప్రియాంక గాంధీతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు రాహుల్. ఇందిరాగాంధీతో తనకు ఎక్కువ చనువు ఉండేదని..తన సోదరి ప్రియాంక ఇటాలియన్ అమ్మమ్మతో ఎక్కువ చనువు ఉండేదని చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఇంటర్వ్యలో రాహులో తరచుగా అడిగే ప్రశ్నకు మరోసారి ఎదుర్కొన్నాడు. ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగిన ప్రశ్నకు..నాకు తెలియదు. చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. కానీ తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని…తాను కూడా పిల్లలకు తండ్రిగా ఉడాలనుకుంటున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా తన అనుభవాలను కూడా పంచుకున్నారు రాహుల్. పాదయాత్రలో రాహుల్ గడ్డ పెంచారు. గడ్డం ఎప్పుడు కత్తిరించుకుంటారని అడగగా…నేను ఈ ప్రయాణంలో నా గడ్డం తీయకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేను దానిని ఉంచాలా వద్దా అని నిర్ణయించుకోవాలని అని చెప్పుకొచ్చారు.