ఒకపక్క అవినీతి కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ మరోపక్క కేరళలోని తన నియోజక వర్గం వ్యవహారాలు చక్కబెట్టుకోలేక సతమతమవుతున్నారు. గుర్తుతెలియని దుండగులు శుక్రవారం వయనాడ్‌లోని ఆయన కార్యాలయంపై దాడికి దిగారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. రాహుల్ వయనాడ్ నుంచే లోక్‌సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.
దాడి వెనకః సీపీఎం కార్యకర్తలు ఉన్నారని, దీనికి సీఎం పినరయి విజయన్ బాధ్యత వహించాలని రాష్ర్ట కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వయనాడ్‌లో అడవులకు సంబంధించి రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించడం లేదంటూ ఈ దాడికి పాల్పడ్డారు. దాడికి చేసింది సీపీఎం అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
I strongly condemn the attack on @RahulGandhi ji’s MP Office at Wayanad. It is nothing but lawlessness & goondaism.
I demand Kerala CM @pinarayivijayan to take Immediate stern action & see that it’s not repeated.
Such incidents will not be tolerated.@INCIndia pic.twitter.com/vII3M7dEpK— Revanth Reddy (@revanth_anumula) June 24, 2022