Rahul Gandhi’s No Show In Poll States, Minister Anurag Thakur’s Swipe 
mictv telugu

రాహుల్ గాంధీ భయపడుతున్నారా?

November 19, 2022


రాహుల్ గాంధీ స్టార్ క్యాంపెయిర్.కాంగ్రెస్ అగ్రనేత.పార్టీలో మాటకు తిరుగులేదు. భారత్ జోడో యాత్ర జోష్‌లో ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ వైపు కన్నెత్తి చూడలేదు. గుజరాత్ రమ్మంటున్నా…నేను రాను బాబోయ్ అంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పేరున్నా అటువైపు వెళ్లడం లేదు. ఇదే బీజేపీ అస్త్రంగా మార్చుకుంది. ఆటకు సిద్ధమవుతాడు,, కానీ .మైదానానికి రాడు అని సెటైర్లు వేస్తోంది. రాగా గుజరాత్ ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? సెంటిమెంట్ భయపెడుతుందా?బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత?

ఎందుకీ దూరం…
గుజరాత్‌లో హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇటు వైపు కన్నెత్తిచూడటం లేదు. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఆయన పేరుంది. అక్కడి స్థానికనేతలు పదే పదే పిలుస్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం గుజరాత్ వెళ్లరని తెలుస్తోంది. భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ రాహుల్ హిమాచల్ ప్రదేశ్ వైపు వెళ్లలేదు. ప్రియాంక గాంధీయే రెండుసార్లు ఆ రాష్ట్రాన్ని చుట్టేశారు. ఇక గుజరాత్‌కు వెళ్లరని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్నే బీజేపీ అవకాశంగా తీసుకుంటోంది.

బీజేపీ సెటైర్లు

గుజరాత్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసి రాహుల్ గాంధీ ప్రచారం చేయడం లేదని బీజేపీ సెటైర్లు వేస్తోంది. గుజరాత్ , హిమాచల్ ఓటములు గాంధీల ఖాతాలో పడొద్దని ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.ఈ ఓటమిని కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పై వేసేందుకు ప్రయతిస్తున్నారన్నారు. అటు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. “రాహుల్‌ని ఎన్నోరోజులుగా చూస్తున్నా.గుహవాటిలో క్రికెట్ మ్యాచ్ అంటే ఆయన గుజరాత్‌లో ఉంటారు. బ్యాట్ , ప్యాడ్‌లు రెడీగా ఉంచుకుంటారు. కానీ గ్రౌండ్‌లోకి మాత్రం దిగరు”అని ఆయన విమర్శించారు. రెండువారాల్లో ఎన్నికలు ఉన్నా ఇప్పటిదాకా గుజరాత్ ప్రచారానికి రాలేదంటున్నారు.

సెంటిమెంట్

రాహుల్ గాంధీకి ఓ సెంటిమెంట్ ఉంది. ఇప్పటిదాకా ప్రచారం చేసిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఏ ఒక్క ఎన్నికలోనూ ఆ పార్టీ గెలువలేదు. అందుకే ప్రత్యర్థి పార్టీ బీజేపీ రాహుల్‌ని ఐరన్ లెగ్ అని విమర్శిస్తోంది. ఈ భయంతోనే గుజరాత్ క్యాంపెయిన్‌కు దూరంగా ఉంటున్నారని బీజేపీ సెటైర్లు వేస్తోంది. కాంగ్రెస్ నేతలు దీన్ని ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో బిజీగా ఉండటంతోనే రావడం లేదని సర్ధిచెబుతున్నారు.