Rahul is Rama, I am Hanuman, KCR?...Revanth
mictv telugu

రాహుల్ రాముడు, నేను హనుమంతుడు, కేసీఆర్?…రేవంత్

July 8, 2022

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతను చేపట్టి నేటీతో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇంత గొప్ప పదవి ఇచ్చినందకు సోనియమ్మకు, రాహుల్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, రాహుల్ గాంధీ రాముడైతే, తాను హనుమంతుడినని, రావణుడులాంటి కేసీఆర్‌ను ఓడించేందుకు యుద్ధం చేస్తానని రేవంత్ రెడ్డి శపథం చేశారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..”టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతను చేపట్టి నేటీతో ఏడాది పూర్తి అయ్యింది. ఈరోజు ఒక్కటే చెప్తున్నా. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయిస్తారు. సోనియా ఎవరి పేరును ప్రకటిస్తే, వారిని పల్లకిలో మోసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెడతాం. నాకు ఇంత గొప్ప పదవి ఇచ్చినందకు సోనియమ్మకు, రాహుల్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. రాహుల్ గాంధీ రాముడైతే, నేను హనుమంతుడిని. వానర సైన్యం కాంగ్రెస్ కార్యకర్తలు. రావణుడు కేసీఆర్. వానర సైన్యం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రావణుడు కేసీఆర్‌ను ఓడించేందుకు యుద్ధం చేస్తానని హామీ ఇస్తున్నాను” అని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుండే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించి, ఆయన 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా రాజకీయం పరంగా ఎమ్మెల్యేగా, టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా,టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను రావణుడితో పోల్చుతూ, కేసీఆర్‌పై యుద్దం చేస్తానని ప్రకటించాడు.