రాహుల్‌కు పబ్బులు, జల్సాలే తెలుసు: కేటీఆర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్‌కు పబ్బులు, జల్సాలే తెలుసు: కేటీఆర్‌

May 14, 2022

నల్లగొండ జిల్లా హాలియా సభలో కేటీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీపై, రాహుల్‌ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీకి పబ్బులు, జల్సాలు మాత్రమే తెలుసు అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే భగత్‌పై కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వారు చేయని, చేయలేని పనులను భగత్ చేసి చూపిస్తున్నాడని పేర్కొన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ..”ఎమ్మెల్యే భగత్‌ కోరిక మేరకు నూతన స్టేడియం కోసం రూ. 3 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఓపెన్ డ్రైనేజీ కోసం రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నాం. జానారెడ్డి నాకు చాలా గౌరవం. కానీ, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వారే చెప్పాలి. పక్కన కృష్ణా నది ప్రవహిస్తున్నా, ఫ్లోరైడ్ నిర్మూలన చేయలేదు. గత పాలకులు రైతులకు సాగు నీరు ఇవ్వని అసమర్థులు. ఫ్లోరైడ్ నిర్మూలనకు కేసీఆర్ కృషి చేసి చూపించారు. ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి ఏం చేశారు.? రాహుల్‌కు ఒక్కసారి అవకాశమిస్తే ఏం అభివృద్ధి చేస్తారు. ఎద్దులు, పొలం, వ్యవసాయం తెలియని నేత రాహుల్ గాంధీ. పబ్బులు, జల్సాలు తప్ప రాహుల్‌కు ఏమీ తెలియదు. నాగార్జున సాగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చే నేతలను నమ్మొద్దు. యువనాయకుడు భగత్‌ను కాపాడుకోవలసిన బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలపై ఉంది’’అని ఆయన అన్నారు.