రాహుల్ మోదీకి సివిల్స్‌లో 420 ర్యాంకు.. కామెడీ కాదు...  - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ మోదీకి సివిల్స్‌లో 420 ర్యాంకు.. కామెడీ కాదు… 

August 4, 2020

Rahul modi got 420 rank in civils exam.

భారత రాజకీయాల్లో రాహుల్, మోదీ అనే పేర్లకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాహుల్ పేరు వినగానే కాంగ్రెస్ నేత గుర్తుకువస్తాడు. మోదీ పేరు వినగానే ప్రస్తుత ప్రధాని గుర్తుకు వస్తారు. రాజకీయ ప్రత్యర్థులు అయిన ఈ ఇద్దరి పేర్లు ఒకరికే ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. 

తాజాగా అదే జరిగింది. ఈరోజు ప్రకటించిన సివిల్ సర్వీసెస్ 2019 పరీక్షా ఫలితాల్లో రాహుల్ మోదీ అనే వ్యక్తికి 420వ ర్యాంక్ వచ్చింది. దీంతో ఈ వ్యక్తి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి పేరుతో వచ్చిన ర్యాంక్ కూడా గమ్మత్తుగా ఉండడంతో నెటిజన్లు ఈ అంశాన్ని వైరల్ చేస్తున్నారు. ఈ పరీక్షలో మొత్తం 829 మంది అభ్యర్థులు ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించగా రాహుల్ మోదీ వారిలో ఒకరు. ఈసారి హరియాణాకు చెందిన ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ సాధించాడు. ఈ ఏడాది మొత్తం 927 ఖాళీలకు గాను 829 అభ్యర్థులు కేంద్రం సర్వీసులకు ఎంపికయ్యారు. మరో 182 మంది అభ్యర్థుల ఫలితాలను యూపీఎస్సీ రిజర్వులో ఉంచింది.