కాబోయే భార్యతో రాహుల్ లిప్ లాక్.. ఆమె ఎవరంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే భార్యతో రాహుల్ లిప్ లాక్.. ఆమె ఎవరంటే..

May 9, 2022

చేసింది కొద్ది సినిమాలే అయినా.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ. త్వరలోనే ఓ ఇంటి వాణ్ని కాబోతున్నానంటూ తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. కాబోయే భార్యకు ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్‌చేస్తూ.. త్వరలోనే పెళ్లి అంటూ అనౌన్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్‌ రెడ్డి స్టైల్‌లో చెప్పినవ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఫోటో చూసిన వారంతా రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బిందు అని కామెంట్ల రూపంలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రాహుల్‌ .. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు హరిత.. బిందు కాదంటూ క్లారిటీ ఇచ్చాడు. రాహుల్ ఇంతకముందు ఓ అమ్మాయి సహజీవనం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. చిన్నప్పుడు తనపై అత్యాచారం జరిగిందని కూడా కొన్నాళ్ల కిందట ప్రకటించాడు. సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని సోషల్ మీడియాలో ప్రకటించి, ఆ తర్వాత అంతా వొట్టిదేనంటూ మాట మార్చాడు. ప్రచారం కోసమే అలా చేస్తున్నారని ఆయనపై విమర్శలు వచ్చాయి.