రంగమార్తాండ సినిమా నుంచి మరో పాట రిలీజ్ చేసింది టీమ్. రాహుల్ సిప్లిగంజ్ ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నిన్న తాను పాడిన పాటకే ఆస్కార్ రావడం, ఆ పాటను తానే స్వయంగా స్టేజి మీద పెర్ఫామ్ చేయడంతో ఇప్పడు కొత్తగా రిలీజ్ చేసిన పాటకు యమా క్రేజ్ వచ్చేసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో, ఇళయరాజా మ్యూజిక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే రెండు విడుదల అయ్యాయి. ఇది మూడవది.
పొదల పొదల గట్ల నడుమ అంటూ వచ్చిన ఈ సాంగ్ ను రాహుల్ సిప్లింగజే స్వయంగా పాడాడు. ఇందులో రాహుల్ కు జోడీగా రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తోంది. దీనిని లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇళయరాజా స్వరపరచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. రంగమార్తాండ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్యపాత్రలుడా చేస్తున్నారు.