నేను గయ్యాళిగంపనా.. నువ్వెవరు అనడానికి? - MicTv.in - Telugu News
mictv telugu

నేను గయ్యాళిగంపనా.. నువ్వెవరు అనడానికి?

October 14, 2019

ఈరోజు బిగ్‌బాస్ ఎపిసోడ్ చాలా వాడివేడిగా సాగింది. టాస్క్‌లో భాగంగా తొలుత శివజ్యోతి, వరుణ్ సందేశ్‌లు వాదులాడుకున్నారు. వరుసగా అందరికీ కలిపి 7 నంబర్ ప్లేట్‌ల నిల్చోబెట్టాడు బిగ్‌బాస్. నాలుగో నంబర్‌ను మినహాయిస్తే మిగతావారు ఎలిమినేషన్ లిస్టులో వుంటారు. ముందు నంబర్లలో వున్నవాళ్లను వీళ్లు కన్విన్స్ చేయాల్సి వుంటుంది. ఈ క్రమంలోనే శివజ్యోతి, వరుణ్, వితికలకు గొడవ జరిగింది. ఆ తర్వాత శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌లు వాదానికి దిగారు. నువ్వు ఏ టాస్క్‌లో బాగా ఆడావ్ అని శ్రీముఖి ప్రశ్నించింది. దీంతో రాహుల్ కాస్త సీరియస్ అయ్యాడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. గయ్యాళిగంపలా అరవకు అని రాహుల్ అరిచాడు. దీంతో ఇద్దరు నువ్వా నేనా అన్న రేంజులో వాదనకు దిగారు. వారిమధ్య తొలతనుంచి టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈవారం వారిద్దరి మధ్య వార్ మరింత ముదిరింది. వచ్చే ఈ కొన్ని రోజుల్లో వారు ఇంకా ఏ స్థాయిలో కీచులాడుకుంటారని బిగ్‌బాస్ అభిమానులు అనుకుంటున్నారు.

Srimukhi. 

ఆ తర్వాత అలీ, శ్రీముఖిలు కూడా వాదనకు దిగారు. శ్రీముఖి ఆటలో బాగా దిమాక్ పెట్టి ఆడుతోందని.. తాను దిమాక్‌తోని కాకుండా దిల్‌తోని ఆడతానని చెప్పాడు. అనంతరం రాహుల్ ఆటను అలీరెజా సమర్థించడంతో శ్రీముఖి ఉడుక్కుంది. రాహుల్ తన ప్లేసును అలీకి ఇచ్చేశాడు. బాబా మాస్టర్ కూడా శ్రీముఖికి మొదటి ప్లేస్ ఇచ్చి తప్పుకున్నాడు. అనంతరం మళ్లీ శివజ్యోతి, వరుణ్ సందేశ్‌లు వాదనకు దిగారు. తాను 3వ నంబర్ నుంచి కదలనని భీష్మించుకుని కూర్చుంది శివజ్యోతి. భార్యకు భర్త సపోర్ట్ చేస్తున్నాడని జ్యోతి ఆరోపించింది. తన భార్య తనకు ముఖ్యం అని వరుణ్ సమాధానం ఇచ్చాడు. ఇక్క భార్యాభర్తల్లా కాకుండా కంటెస్టెంట్లుగా ఆడాలని జ్యోతి చెప్పింది. ఈ క్రమంలో చాలాసేపటి వరకు వారిమధ్య వాదన కొనసాగింది. 

కొద్ది సేపటికి బిగ్‌బాస్ వారందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అందరూ ఆరోగ్యంగా ఆడని క్రమంలో ఇంటి సభ్యులను అందరినీ ఎలిమినేట్ చేస్తున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో అందరూ నోరెళ్లబెట్టారు. అప్పుడు బాబా మాస్టర్ విజిల్ వేసి తన ఆనందాన్ని తెలిపారు. ఇంతవరకు ఏ ఎపిసోడ్‌లో ఇలా అందరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవలేదు. ఇదే మొదటిసారి అవడం విశేషం. చూడాలి మరి ఈవారం అందరిలో ఎంతమంది వుంటారో.. ఎంతమంది ఇంటినుంచి బయటకు వస్తారో?