దీపావళి తర్వాత పట్టాభిషేకం - MicTv.in - Telugu News
mictv telugu

దీపావళి తర్వాత పట్టాభిషేకం

October 11, 2017

కొన్నేళ్ల తరబడి వస్తున్న ఊహాగానాలు నిజం కానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ దీపావళి పండగ తర్వాత పగ్గాలు చేపడతారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. తాను ప్రధాని పదవికి పోటీ పడటానికి, పార్టీకి సారథ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్ ఇటీవల అమెరికా పర్యటనలో చెప్పిన నేపథ్యంలో పట్టాభిషేకంపై సమాచారాన్ని లీక్ చేయడం గమనార్హం. పోటీ లేకుండా ఆయన పార్టీ పగ్గాలను తన తల్లి సోనియా గాంధీ నుంచి అందుకుంటారని తెలుస్తోంది. సోనియా 19 ఏళ్లకుగా పార్టీకి సారథ్యం వహిస్తుండడం, రాహుల్ ప్రస్తుతం ఉపాధ్య బాధ్యతలు నిర్వర్తిస్తుండడం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ చాలా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మరోపక్క బీజేపీ బలపడుతోంది. దీంతో ఇక రాహుల్‌ను రంగంలోకి దించడం తప్పనిసరి అయింది. ప్రస్తుతం పార్టీలో సంస్థాగత ఎన్నికల కోసం కసరత్తు జరుగుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ ఉనికిని కాపాడుకోవాల్సిన అగత్యమేర్పండి.