నేడు భారత్- శ్రీలంక మద్య రెండో టీ20 జరగనుంది. పుణె వేదికగా రాత్రి 7 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. మెదటి టీ20లో ఘన విజయం అందుకున్న టీం ఇండియా సిరీస్‌పై కన్నేసింది. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇక సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంక తప్పక గెలవాల్సి ఉంది.
రెండో టీ20లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. గాయం కారణంగా జట్టుకి దూరమైన సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ అవకాశం దక్కించకున్నాడు. అయితే అతడు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. ఇషాన్ కిషాన్ కీపింగ్ చేస్తుండడంతో రాహుల్ త్రిపాఠి బరిలో దిగే అవకాశం ఉంది.
రుతురాజ్ గైక్వాడ్‌కు ఈసారి నిరాశ తప్పదు. అనారోగ్యం కారణంగా మొదటి టీ20కి దూరమైన అర్షదీప్ రెండో టీ20కి సిద్ధంగా ఉన్నాడు. ఇతని కోసం హర్షల్ పటేల్ లేదా ఉమ్రాన్ మాలిక్ లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాలి. నాలుగు వికెట్లతో చెలరేగిన శివమ్ మావికి తుది జట్టులో స్థానం గ్యారంటీ. ముంబైలో తేలిపోయినా చాహల్ ఈ మ్యాచ్‌లో చోటుదక్కడంపై ఆసక్తి నెలకొంది. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను జట్టు మేనేజ్ మెంట్ పరిశీలిస్తోంది. పుణె పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తూనే బ్యాటింగ్‌కూ అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. గత మ్యాచ్ లో విఫలమైన గిల్, సూర్యకుమార్ యాదవ్ రాణించాల్సి ఉంది.