Rahul Yatra..NayaJosh In T Congress
mictv telugu

జోడో జోష్..టీ కాంగ్రెస్ రాత మారుస్తుందా?

November 1, 2022

Rahul Yatra..NayaJosh In T Congress

ఒక్క యాత్ర కాంగ్రెస్ కార్యకర్తల్ని కదిలించింది. ఒక్క మాట వారిలో ఉరిమే ఉత్సాహం నింపింది. ఒక్క అడుగు కదనరంగంవైపునకు నడిపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రని తెలంగాణ కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుందా? కదిలిన కాంగ్రెస్ శ్రేణుల్ని 2023 యుద్ధంలోకి ఉరికిస్తుందా?

జోడో యాత్ర జోరు

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది.మహబూబ్‌నగర్ జిల్లా నుంచి హైదరాబాద్‌లో రాహుల్ అడుగుపెట్టారు. పాతబస్తీలో యాత్రకు పెద్దయెత్తన కార్యకర్తలు తరలివచ్చారు. వీదులన్నీ జనసంద్రమయ్యాయి. ఊహించినదాని కంటే ఎక్కువమంది తరలివచ్చారు రాహుల్‌తో కలిసి అడుగులు వేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. చేతిలో కాంగ్రెస్ జెండా పట్టుకుని రాహుల్ గాంధీతో కలిసి ఉత్సాహంగా నడిచారు. ఈ యాత్రలోనే రాహుల్‌ని రోహిత్ వేముల తల్లి రాధిక కలిసింది. ఆమెను ఆప్యాయంగా పలకరించారు. పూర్తి న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ ఆమెకు హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన యాత్రకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. ఆయనతో కలిసి అడుగులు వేస్తున్నారు.

నేతలు కలిసికట్టుగా

టీకాంగ్రెస్ నేతల్ని జోడో జోష్ ఒక్కటి చేసింది. విభేదాలు మరిచి ఒక్కటయ్యారు. రాహుల్ యాత్రలో అందరూ కలిసి అడుగులేశారు.తెలంగాణలో యాత్ర మొదలైనప్పటి నుంచి ఇదే కనిపించింది. మునుగోడు బైపోల్‌లో బీజీ ఉన్నా..రాహుల్ యాత్రకు రేవంత్ అండ్ కో వచ్చి వెళ్లింది. యాత్ర ఎఫెక్ట్ మునుగోడుపై ఉంటుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ ఎక్కడ మునుగోడు ప్రస్తావన పెద్దగా తేలేదు. అసలు ఆ అంశంపైనే ఫోకస్ చేయలేదు.

ఇదే స్ఫూర్తితో…

జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తితో 2023 అసెంబ్లీకి ప్రిపేర్ కావాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. పల్లెల్లో కేడర్ ని తట్టిలేపుతారని ఆశిస్తున్నారు. నేతలందరూ విభేదాలు, పట్టింపులు పక్కన పెట్టి కదనరంగంలోకి దూకాలని వేడుకుంటున్నారు. మరి వీరి మాటల్ని ఆ పార్టీ నేతలు పట్టించుకుంటారో లేదో చూడాలి.