RahulGandhi Gujarat Tour In Funny Incident
mictv telugu

రాహుల్ గాంధీలో ఎంత మార్పు

November 22, 2022

రాహుల్ గాంధీలో భారత్ జోడో యాత్ర మార్పు తెచ్చింది.యాత్రలో సామాన్యుల కష్టాలు తెలుసుకున్నారు.గుజరాత్ ఎన్నికల ప్రచారంలో వీటిపై ఎక్కువ ఫోకస్ చేశారు. ఆదివాసీల కష్టాల్ని ప్రస్తావించారు. స్పీచ్‌కు మధ్యలో అడ్డుతగిలిన ఓ కార్యకర్త విజ్ఞప్తిని విన్నారు. అంతేకాదు నిమిషాల్లో అతని కోరికను తీర్చేశారు.

యాత్ర మార్చేసింది..!

జోరుగా ప్రసంగం సాగుతోంది. రాహుల్ ఆవేశంగా మాట్లాడుతున్నారు. గుజరాత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రసంగం మొదలెట్టి 13 నిమిషాలు అయింది. మధ్యలో గ్యాలరీ నుంచి ఓ కార్యకర్త అరుపులు…రాహుల్ వైపు చూస్తూ ఏదో చెబుతున్నాడు. రాహుల్ అతని వైపు చూసి స్పీచ్ ఆపేశారు.ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. హిందీ అందరికి అర్థమవుతుంది. మీరు హిందీలో నే మాట్లాడండి..గుజరాతీ అనువాదం అక్కర్లేదంటూ కోరారు. మీ అందరికి హిందీ అర్థమవుతుందా అని రాహుల్ అడిగారు. జనం తలఊపారు. మీకు హిందీ ఓకే అయితే నాకూ ఓకే అంటూ రాహుల్ హిందీలో మాట్లాడారు. గుజరాతీ అనువాదం చేస్తున్న వ్యక్తిని పక్కకు పంపించారు.

ఎంత మార్పు…

సభల్లో నేతలు మాట్లాడుతుంటే మధ్యలో ఆటంకం కల్పిస్తే చిరాకుపడుతారు. అతన్ని బయటకు తీసుకెళ్లండి అని కార్యకర్తలకు చెబుతుంటారు. లేదంటే సదరు నేతలే అతన్ని నాలుగు తిట్టిఊరుకుంటారు. ఏమైనా ఉంటే సభ అయ్యాక వచ్చి మాట్లాడమంటారు. ఇక్కడ రాహుల్ అలా చేయలేదు. కార్యకర్త వినతిని అలకించారు. క్షణాల్లో పాటించి అందరి మెప్పు పొందారు. రాహుల్ చేసిన ఈ పని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మనస్సు దోచింది. రాహుల్ గాంధీని నెటిజన్లు మొచ్చుకుంటున్నారు. పాదయాత్ర తెచ్చిన మార్పు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

జోడో జోష్

భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీలో కొత్త జోష్ నింపింది. కన్యాకుమారి నుంచి చేపట్టిన యాత్రకు రాహుల్ బ్రేక్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంకోసం ఆయన ఈ విరామం తీసుకున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.ఆదివాసీల్ని బీజేపీ సర్కార్ పట్టించుకోవట్లేదని రాహుల్ విమర్శించారు. వనవాసీల పేరిట నగరాలకు దూరంగా ఉంచుందని మండిపడ్డారు.మొత్తానికి రాహుల్ గాంధీ చేసిన చిన్న పని అందరి దృష్టిని ఆకర్షించింది.